రాజకీయాలు
అనంతపురం మేయర్‌గా చిట్లూరు రమేష్ ప్రమాణం
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌గా చిట్లూరు రమేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో 62 మంది కార్పొరేటర్లు కూడా ప్రమాణం చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్ టి. స్వాతి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.